Mahanadu: ఆయన పేరు చెప్పుకొని బతకాల్సిందే.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ

by Vemula.Srinu Prasad |

ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని నందమూరి బాలకృష్ణ తెలిపారు...

Mahanadu: ఆయన పేరు చెప్పుకొని బతకాల్సిందే.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని నందమూరి బాలకృష్ణ తెలిపారు. రామారావు అంటే నటనకు ప్రతిరూపం, నవరసాలకు ఒక అర్థం, ఒక గ్రంథాలయం, నవ శకానికి ఆరంభం, ఒక జాతికి ఆదర్శం, అగ్నికణం అని ఆయన కొనియాడారు. తెలుగు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహనీయుడని చెప్పారు. ఎవరికీ దక్కని మహత్తర జన్మను నందమూరి తారకరామారావు పొందారని తెలిపారు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ప్రయోగాలు చేశారని బాలయ్య తెలిపారు. ప్రతి తెలుగు బిడ్డలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పెట్టి చాలా మందికి రాజకీయ భిక్ష పెట్టారని వ్యాఖ్యానించారు. సామాన్యులకు చాలా పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఇప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను చెప్పుకుని బతకాల్సిందేనని చెప్పారు.

Next Story