హత్యారాజకీయాలపై ఎమ్మెల్యే దివ్య ఆగ్రహం.. కూకటివేళ్లతో పెకలిస్తామని వార్నింగ్

by Vemula.Srinu Prasad |

తుని నియోజకవర్గంలో హత్యారాజకీయాలను కూకటివేళ్లతో పెకలిస్తామని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు...

హత్యారాజకీయాలపై ఎమ్మెల్యే దివ్య ఆగ్రహం.. కూకటివేళ్లతో పెకలిస్తామని వార్నింగ్
X

దిశ, కాకినాడ: తుని నియోజకవర్గంలో హత్యారాజకీయాలను కూకటివేళ్లతో పెకలిస్తామని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి‌లో హత్యకు గురైన టిడిపి కార్యకర్త బంగారయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ ముల్లును ముల్లుతో తీసే విద్య తమకు తెలుసని వార్నింగ్ ఇచ్చారు. కానీ చట్టాన్ని గౌరవించి గమ్ముగా ఉంటున్నామని తెలిపారు. ఈసారి హత్య రాజకీయాలు రిపీట్ అయితే నడిపించి కాదు ఈడ్చుకుని తీసుకువెళ్తామన్నారు. మహిళా శక్తి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. కార్యకర్తలందరికీ తాను అండగా ఉంటానని దివ్య హామీ ఇచ్చారు.

Next Story