- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ ఆశయాలు నెరవేర్చాలి: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
పవన్ కల్యాణ్ ఆశయాలు నెరవేర్చాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, డైరెక్టర్‌ల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. చైర్‌పర్సన్‌గా పెనుమాల లక్ష్మి బాలరాజు , వైస్ చైర్మన్‌తోపాటు పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటవీశాఖ ప్రభుత్వ సలహాదారు పెన్నమరెడ్డి నాగబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పి.గన్నవరం నీటి సంఘం డైరెక్టర్ పెనుమాల చిన నాగేశ్వరరావు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఏఎంసీ చైర్‌పర్సన్ పెనుమాల లక్ష్మి బాలరాజు పాలక వర్గం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. నగరం మార్కెట్ కమిటీకి సమర్థవంతమైన పాలన అందించాలని సూచించారు. నగరం మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హామీ ఇచ్చారు. మరోవైపు రైతుల సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని ఏఎంసీ చైర్‌పర్సన్ పెనుమాల లక్ష్మి బాలరాజు తెలిపారు. లింక్ రోడ్లు వంటి అంశాలపై దృష్టిసారిస్తామని చైర్‌పర్సన్ పెనుమాల లక్ష్మి బాలరాజు వెల్లడించారు. నగరం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పెనుమాల లక్ష్మి బాలరాజు ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనిపించాయి.






