మంత్రి చొరవ.. 15 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి త్రాగునీరు

by Jakkula.Mamatha |

కాజులూరు మండలం దుగ్గుదూరు శివారు పొలమూరుపాడు గ్రామ ప్రజల చిరకాల వాంఛ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో తీరింది.

మంత్రి చొరవ.. 15 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి త్రాగునీరు
X

దిశ, కాజులూరు: కాజులూరు మండలం దుగ్గుదూరు శివారు పొలమూరుపాడు గ్రామ ప్రజల చిరకాల వాంఛ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో తీరింది. గత 15 ఏళ్ల సంవత్సరాలుగా ఆ గ్రామ ప్రజలు తాగునీరు కోసం స్థానిక బావులు, ఆర్ ఓ ప్లాంట్ల మీద ఆధారపడి జీవిస్తున్నారు. మంత్రి సుభాష్ ఆదేశాలతో కుయ్యేరు గ్రామం నుంచి కోలంక గ్రామపంచాయతీకి వెళ్లే తాగునీటిని పొలమూరుపాడు గ్రామానికి అందించడం ద్వారా ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని మంచినీటి సమస్య తీరింది. దీంతో ఆ గ్రామ ప్రజలు మంత్రి సుభాష్‌కు జేజేలు పలుకుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గురువారం మంత్రి సుభాష్ ఆ గ్రామానికి వెళ్లి ఆయన చేతుల మీదుగా తాగునీరు సరఫరా చేసి మీకు అండగా ఉంటాను అంటూ భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గ్రామoలో సుమారు 30 మీటర్లు రోడ్డు నిర్మాణానికి ,అలాగే లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాలకు నీరు వెళ్లకుండా అడ్డగిస్తున్న ఒక రైతు పై చర్యలు తీసుకోవాలని రైతులందరూ వినతిపత్రం అందించడం ద్వారా సంబంధిత వ్యక్తి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జె.రాంబాబు, సర్పంచ్ పోతు వెంకటలక్ష్మి జ్యోతి కుమార్ కాజులూరు కోటిపల్లి సాగునీటి పంపిణీ సంఘం అధ్యక్షులు లఖాని కృష్ణ చైతన్య, దాట్ల విజయ గోపాల రాజు నామవానిపాలెం సర్పంచ్ భూపతిరాజు చిట్టి రాజు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు గ్రామీణ నీటి సరఫరా అధికారులు పాల్గొన్నా

Next Story