లోకేష్‌ది రాయలసీమ డీఎన్ఏ కాదు.. తెలంగాణ డీఎన్ఏ: Minister Raja

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-17 13:03:20  IST  )

నారా లోకేష్ ది రాయలసీమ డీఎన్ఏ కాదని..తెలంగాణ డీఎన్ఏ అని మంత్రి దాడి శెట్టి రాజా తీవ్ర ఆరోపణలు చేశారు...

లోకేష్‌ది రాయలసీమ డీఎన్ఏ కాదు.. తెలంగాణ డీఎన్ఏ: Minister Raja
X

దిశ, తుని: నారా లోకేష్ ది రాయలసీమ డీఎన్ఏ కాదని..తెలంగాణ డీఎన్ఏ అని మంత్రి దాడి శెట్టి రాజా తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకసారి డీఎన్ఏ ఏంటో చెక్ చేసుకోవాలని లోకేష్‌కు ఆయన సూచించారు. చంద్రబాబు పర్యటనలో మానసిక వైద్యులను పెట్టాలన్నారు. జగన్ పాలన చూసి ఫ్రస్టేషన్‌లో ఉన్నారని.. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు.

మరోసారి జగన్ కుటుంబాన్ని దుర్భాషలాడితే నాలుక చీరేస్తాం..

మరోసారి జగన్ కుటుంబాన్ని దుర్భాషలాడితే నాలుక చీరేస్తానంటూ మంత్రి దాడిశెట్టి రాజా హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు తిరస్కరిస్తారని తెలిసే ఏపీలో చంద్రబాబు ఇళ్ళు కట్టుకోలేదన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను ప్రజలు సంతృప్తిగా ఆశ్వాదిస్తున్నారని, అందుకే పాదయాత్రలు ఫెయిల్ అవుతున్నాయని మంత్రి దాడి శెట్టి జోస్యం చెప్పారు.

Next Story