- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు వ్యక్తి బలి
కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణం జరిగింది..

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) సామర్లకోట(Samarlakota)లో దారుణం జరిగింది. లోన్ రికవరీ ఏజెంట్ల(Loan Recovery Agents) వేధింపులు తాళ్లలేక ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఆత్మహత్య(Suiside) చేసుకున్నారు. 8 నెలల క్రితం ఓ ప్రైవేటు బ్యాంకులో ఉమామహేశ్వరరావు రూ.8 లక్షల రుణం తీసుకున్నారు. ఇందుకు ప్రతి నెలా ఈఎంఐ కట్టుకుంటూ వచ్చారు. అయితే రెండు నెలలుగా ఉమామహేశ్వరరావుకు ఆర్థిక ఇబ్బందులు మరీ ఎక్కువ అయ్యాయి. దీంతో బ్యాంకు లోన్ డబ్బులు కట్టలేకపోయారు. దీంతో రికవరీ ఏజెంట్ల వేధింపులు మొదలయ్యాయి. ఉమామహేశ్వరరావు ఇంటికి తాళం వేశారు. కట్టేస్తామని వేడుకోవడంతో వారం సమయం ఇచ్చారు. అయితే వారం గడిచిపోవడంతో ఉమామహేశ్వరరావు తీవ్ర మానసిక వేదనకు గురియ్యారు. రాత్రంతా బాధపడ్డారు. తెల్లవారే సరికి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్లే ఉమహేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.






