విద్యుత్ ప్రమాదంలో లారీ దగ్ధం.. డ్రైవర్ స్పాట్ డెడ్

by Jakkula.Mamatha |

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కండ్రిగ గ్రామంలో లారీ దగ్ధమైంది.

విద్యుత్ ప్రమాదంలో లారీ దగ్ధం.. డ్రైవర్ స్పాట్ డెడ్
X

దిశ, కొత్తపేట : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కండ్రిగ గ్రామంలో లారీ దగ్ధమైంది. విద్యుత్ తీగ తగలడంతో లారీ కాలిపోయింది. రావులపాలెం - అమలాపురం ప్రధాన రహదారిలో సోమవారం ఉదయం కండ్రిగ వద్ద ఈ ప్రమాదం జరిగింది. లారీకి అందేంత ఎత్తులో విద్యుత్ తీగ ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని అంబులెన్స్ లో తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story