- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kakinada | గర్భిణి మరణం.. వైద్యుల నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం
కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి మల్లేశ్వరి (Pregnant Malleswari) ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్ డెస్క్ : కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి మల్లేశ్వరి (Pregnant Malleswari) ప్రాణాలు కోల్పోయారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఓ 55 ఏళ్ల రోగికి గడువు ముగిసిన మందులు ఇవ్వడంతో నవంబర్ 8న మరణించారు. ఒకే నెలలో ప్రభుత్వాసుపత్రుల్లో రెండు మరణాలు సంభవించడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహానికి వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గర్భిణికి పాంటాప్రోజోల్ అలెర్జీ ఉందని, హైపర్ టెన్షన్, డయాబెటిస్ కూడా ఉన్నాయని కేస్ షీట్లోనే నమోదు చేసినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నవంబర్ 20న మధ్యాహ్నం పీజీ విద్యార్థిని పాంటాప్ ఇంజెక్షన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల పేషెంట్‌కు వెంటనే ఫిట్స్, అనంతరం కార్డియాక్ అరెస్ట్ తో రాత్రి 10 గంటల సమయంలో ఆమె మరణించినట్లు ప్రాధమిక విచారణలో తేలిందన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్యవేక్షణా లోపం కూడా కారణమని తెలిసిందన్నారు. సంబంధిత వైద్య సిబ్బందిపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందిన గర్భిణీ కుటుంబానికి సాయం అందించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిర్దేశించారు.






