Jr.NTR Fan Death Case: శ్యామ్ మృతి కేసులో కలకలం రేపుతోన్న సెల్పీ వీడియో

by Disha Web Desk 16 |
Jr.NTR Fan Death Case: శ్యామ్ మృతి కేసులో  కలకలం రేపుతోన్న సెల్పీ వీడియో
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శ్యామ్ ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో సెల్ఫీ వీడియో ఒకటి కలకలం రేపింది. శ్యామ్ ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న సెల్పీ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆ సెల్ఫీ వీడియోలో 'అమ్మా, నాన్న నన్ను క్షమించండి. నేను అందరి దృష్టిలో వేస్ట్. నేను ఉన్నా.. మీకు లాభం లేదు. నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా' అని వాపోయాడు. అమ్మనాన్న మళ్లీ జన్మంటూ ఉంటే మీ కొడుకుగానే పుట్టాలని కోరుకుంటున్నా అని వాపోయాడు. మరోవైపు సాయి అనే వ్యక్తి గురించి కూడా ప్రస్తావించారు. వచ్చే జన్మంటూ ఉంటే సాయన్నకు శిష్యుడిగా పుట్టాలని తాను కోరుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో శ్యామ్ చెప్పాడు.

ఇదిలా ఉంటే శ్యామ్ మృతిపై ఎన్టీఆర్ అభిమానులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక వైసీపీ ఉందని టీడీపీ ఆరోపించింది. విచారణ చేపట్టాలని సైతం పోలీసులను కోరారు.


కాగా తూర్పుగోదావరి జిల్లా కొప్పిగుంటకు చెందిన శ్యామ్ ఎన్టీఆర్ వీరాభిమాని. జూన్ 25న శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నారు. అటు శ్యామ్ మరణ వార్త తెలియడంతో జూనియర్ ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శ్యామ్ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో విచారణ చేపట్టాలని పోలీసులను జూనియర్ ఎన్టీఆర్‌ సైతం విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed