- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలవరానికి నిధుల మంజూరు పై హర్షం
by Jakkula.Mamatha |
కేంద్రం బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్ట్ నకు నిధులు మంజూరు చేయడం పట్ల గొల్లపాలెం నీటి సంఘం అధ్యక్షులు తాడి రామారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

X
దిశ, కాజులూరు: కేంద్రం బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్ట్ నకు నిధులు మంజూరు చేయడం పట్ల గొల్లపాలెం నీటి సంఘం అధ్యక్షులు తాడి రామారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో పోలవరం పూర్తి అవుతుంది. అనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. విషయమై రామారెడ్డి ఆదివారం గొల్లపాలెంలో తన కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ అదే విధంగా జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రైతు పక్షపాతి గా పని చేస్తున్నారని అన్నారు. కాజులూరు మండలంలో త్వరలోనే రైతుల సమస్యలు అన్నీ పరిష్కారం కానున్నాయని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు అన్యం శ్రీ రామచంద్ర మూర్తి, యాళ్ల వెంకటరమణ, గొల్లపల్లి సోమ శంకర్, చుండ్రు వీర్రాజు చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Next Story






