- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాపులకు పవన్ కల్యాణ్ కీలక పిలుపు
కాపులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పిలుపునిచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: కాపులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. కాపు కార్పొరేషన్‌లో టైపిస్టులకు సైతం జీతాలు ఇవ్వని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు సీఎం జగన్ రిజర్వేషన్ ఇవ్వలేదని తెలిపారు. కాపులకు ఈబీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదో వైసీపీ కాపు ఎమ్మెల్యేలు చెప్పాలని డిమాండ్ చేశారు. తనను తిట్టడం తప్ప వైసీపీ కాపు ఎమ్మెల్యేలు ఏం చేశారో చెప్పాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో వారాహి విజయభేరీ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజాపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తో సావాసం చేసి జక్కంపూడి పిల్లలు కూడా అలానే తయారయ్యారని ఎద్దేవా చేశారు. జగనన్న లే అవుట్‌లో జక్కంపూడి వాటాలు తీసుకున్నారని ఆరోపించారు. ఇళ్ల పట్టాలపై రూ. 300 కోట్లు సందించారని తెలిపారు.






