‘దిశ’ కథనానికి స్పందన.. రోడ్డు వెడల్పు పెంచిన అధికారులు

by Jakkula.Mamatha |

కాజులూరు మండలం గొల్లపాలెం - కుయ్యేరు రోడ్డు వెడల్పు పెంచనున్నారు.

‘దిశ’ కథనానికి స్పందన.. రోడ్డు వెడల్పు పెంచిన అధికారులు
X

దిశ, కాజులూరు: కాజులూరు మండలం గొల్లపాలెం - కుయ్యేరు రోడ్డు వెడల్పు పెంచనున్నారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గొల్లపాలెం కుయ్యేరు రోడ్డు నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే గొల్లపాలెం నుంచి 9 మీటర్లు వేసి, కాజులూరులో కేవలం 7 మీటర్లు మాత్రమే వేస్తున్నారు. విషయమై రోడ్డు వెడల్పు ఎందుకు తగ్గిందనే శీర్షికన ‘దిశ’లో కథనం ప్రచురితం అయింది. దీనికి మంత్రి సుభాష్ స్పందించారు. కాజులూరులో కూడా 9 మీటర్లు వేయాలని ఆదేశించారు. దీంతో ఎస్టిమేట్ సిద్ధం చేశారు.

Next Story