భార్యను చంపిన కేసులో భర్త అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-20 15:02:08  IST  )

రఘుదేవపురంలో ఇటీవల భార్యను అతికిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన ఘటనలో నిందితుడు కోట నూకరాజును అరెస్ట్ చేసినట్లు సీఐ ఎస్.వి.వి.ఎస్. మూర్తి తెలిపారు...

భార్యను చంపిన కేసులో భర్త అరెస్ట్
X

దిశ, సీతానగరం ప్రతినిధి: రఘుదేవపురం: మండలంలోని రఘుదేవపురంలో ఇటీవల భార్యను అతికిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన ఘటనలో నిందితుడు కోట నూకరాజును అరెస్ట్ చేసినట్లు సీఐ ఎస్.వి.వి.ఎస్. మూర్తి తెలిపారు. నిందితుడి కోడలు చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఘటన వివరాలు:

సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. నూకరాజు కుమారుడు శ్రీను ఇటీవల గుండెపోటుతో మరణించాడు. ఈ క్రమంలో కోడలు చంద్రకళను, ఆమె పిల్లలను తాను పోషించలేనని నూకరాజు తేల్చిచెప్పాడు. అయితే, అతని భార్య సుబ్బలక్ష్మి (60) మాత్రం.. "నువ్వు ఎవరినీ పోషించాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయి తన పిల్లలను తనే పెంచుకుంటుంది" అని భర్తను వారించింది. ఈ విషయంలో దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

హత్య జరిగిన తీరు:

మృతురాలు సుబ్బలక్ష్మి కోరుకొండ నరసాపురం వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత, నూకరాజు ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు. అనంతరం తన వద్ద ఉన్న కత్తితో భార్య సుబ్బలక్ష్మి పీక కోసి హత్య చేశాడు. ఆ వెంటనే అదే కత్తితో తన గొంతును కూడా కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కిటికీలో నుంచి ఈ భీభత్సాన్ని గమనించిన కోడలు చంద్రకళ భయంతో కేకలు వేయడంతో, స్థానికులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే సుబ్బలక్ష్మి రక్తపు మడుగులో మృతి చెంది ఉండగా, తీవ్ర గాయాలతో ఉన్న నూకరాజును అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story