- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్య దేవుని హుండీల లెక్కింపు.. ఎంత ఆదాయం వచ్చిందంటే?
by Jakkula.Mamatha |
అన్నవరం సత్యదేవునికి హుండీల ద్వారా రూ.కోటి 19 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు.

X
దిశ,అన్నవరం: అన్నవరం సత్యదేవునికి హుండీల ద్వారా రూ.కోటి 19 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కొండపైన గల స్వామి వారి శాశ్వత కళ్యాణ మండపంలో దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో సుబ్బారావు సమక్షంలో అధికారులు ఉద్యోగులు సంయుక్తంగా హుండీల ద్వారా లభించిన సొమ్మును లెక్కించారు. ఇందులో పైన పేర్కొన్న నగదుతో పాటు 26 గ్రాముల బంగారం, 512 గ్రాములు వెండి లభించాయి. అలాగే యూఎస్ఏ 46, మలేషియా 15, ఆస్ట్రేలియా 20, యూఏఈ 105, సౌదీ సెంట్రల్ బ్యాంక్ 5, యూరో 60 లభించినట్లు అకౌంట్ విభాగం అధికారులు వెల్లడించారు. లెక్కింపు కార్యక్రమంలో ఏఈవోలు, సూపరింటెండెంట్ ఇతర అధికారులు, సిబ్బంది, సేవాసమితి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story






