రెండు పల్టీలు కొట్టి కారు బోల్తా.. హనుమాన్ మాలదారులకు తప్పిన ప్రమాదం

by Vemula.Srinu Prasad |

తూర్పుగోదావరి జిల్లా రామన్నపాలెం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్ మాలధారులు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది..

రెండు పల్టీలు కొట్టి కారు బోల్తా.. హనుమాన్ మాలదారులకు తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) రామన్నపాలెం శివారు(Ramannapalem Outskirts)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. హనుమాన్ మాలధారులు(Hanuman Devotees) ప్రయాణిస్తున్న కారు(Car) ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. వేగంగా ఉన్న కారు రెండు పల్టీలు కొట్టి బోల్తా పడింది.ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ఐదుగురు హనుమాన్ స్వాములకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కారులో చిక్కుకున్న స్వాములను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

భద్రాచలం నుంచి వెళ్తుండగా...

అయితే బాధిత మాలధారులు భద్రాచలంలో స్వామివారి దర్శనం ముగించుకుని తిరిగి తమ స్వగ్రామానికి ప్రయాణవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story