- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుంభమేళాకు వెళ్లే తెలుగువారికి గుడ్ న్యూస్.. 8వ తేదీన ప్రత్యేక రైలు
కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రత్యేక కృషితో రైల్వే శాఖ కాకినాడ నుండి కుంభమేళాకు మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది.

దిశ,కాకినాడ: కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రత్యేక కృషితో రైల్వే శాఖ కాకినాడ నుండి కుంభమేళాకు మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్ రాజ్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహా కుంభమేళాకు హాజరయ్యేందుకు గతంలో రైల్వే శాఖ ఫిబ్రవరి 20న కాకినాడ నుండి ప్రయోగరాజ్ కు ఏసీ బోగీలతో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది.
అయితే భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా ఏసీ తో పాటు స్లీపర్ క్లాస్ బోగీలతో అదనంగా మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జనవరి 20న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే శాఖ ఫిబ్రవరి 8న మరో అదనపు రైలును ఏర్పాటు చేసింది. 07095 నెంబర్ తో కాకినాడలో ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 2.30 గం. బయలుదేరే ప్రత్యేక రైలు రెండు రోజుల తర్వాత ప్రయాగ్ రాజ్ కు చేరుకోనుంది. ఈ సందర్భంగా భక్తుల డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలు ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు కాకినాడ జిల్లా ప్రజలు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.






