- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిఠాపురంలో వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే దొరబాబు గుడ్ బై
by Vemula.Srinu Prasad |
కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసిపి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు..

X
దిశ, పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైసీపీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, గత ఎన్నికల ముందు గడపగడపకు ప్రచారంలో తానే ముందున్నానని ఆయన వెల్లడించారు అయినప్పటికీ జగన్ నుంచి తనకు ఎటువంటి గుర్తింపు రాలేదని, కనీసం ఎన్నికల్లో తనను ప్రచారం చేయమని కూడా అడగకపోవడం బాధాకరమన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు వైసీపీని వీడుతున్నానని దొరబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే కూటమినేతలు తనతో టచ్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. త్వరలోనే కూటమిలో చేరుతున్నట్లు వెల్లడించారు. కూటమి చేసే కార్యక్రమాలకు తన మద్దతుంటుందన్నారు. ఇది తన రాజకీయ స్వలాభం కోసం కాదని కార్యకర్తల అభీష్టం మేరకు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఆకాంక్షతో తాను పార్టీ మారుతున్నట్లు దొరబాబు స్పష్టం చేశారు
Next Story






