- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజమండ్రిలో రెచ్చిపోయిన మాజీ ఎంపీ అనుచరుడు.. ఈవెంట్ యాంకర్‌పై దాడి
దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి(Rajahmundry)లో దారుణం జరిగింది. ఈవెంట్ యాంకర్ కావ్యశ్రీ(Event anchor Kavyashri)తో పాటు ఆమె తండ్రిపై నల్లూరు శ్రీనివాస్(Nalluru Srinivas) అనే వ్యక్తి దాడి చేశారు. అప్పు తీర్చమని అడిగినందుకు వారిపై పిడుగుద్దులు కురిపించారు. ఇంటి వద్దకు వచ్చి అప్పు అడుగుతారా అంటూ రెచ్చిపోయారు. దుర్భాషలాడుతూ తండ్రీ కూతుళ్లపై దాడి చేశారు. మూడు సంవత్సరాల క్రితం యాంకర్ కావ్య తండ్రి వద్ద నల్లూరు శ్రీనివాస్ అప్పు తీసుకున్నారు. ఎంతకీ తీర్చకపోవడంతో కోనసీమలో ఈవెంట్‌లో యాంకరింగ్ చేసేందుకు వెళ్లిన కావ్యశ్రీ ఆమె తండ్రి.. రాజమండ్రిలోని నల్లూరు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి అప్పు కట్టమని అడిగారు. దీంతో నల్లూరి శ్రీనివాస్ కోపంతో ఊగిపోయారు. ఇంటికే వచ్చి అడుగుతారా అంటూ బూతులు తిట్టారు. కావ్యశ్రీ తండ్రిని ఇంటి ప్రాంగణంలోకి తీసుకొచ్చి దాడి చేశారు. పక్కనే ఉన్న ఆమెపై సైతం చేయిచేసుకున్నారు. దీంతో కావ్యశ్రీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా కావ్యశ్రీ మాట్లాడుతూ అమ్మాయినని కూడా చూడకుండా నల్లూరి శ్రీనివాస్ దాడి చేశారని తెలిపారు. వీడియో తీస్తున్నా పొగరుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. చేయి చేసుకుంటాడని తాను ఊహించలేదని కావ్య శ్రీ వాపోయారు. అహంతోనే మాజీ ఎంపీ అనుచరుడు తనపై దాడి చేశారని మండిపడ్డారు.