- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pithapuram:వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన సవాల్?
వైసీపీ నేతలు ఎవరైనా తనతో చర్చలకు వస్తే జగన్ అక్రమాలు నిరూపించడానికి సిద్ధమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ ఎన్ వర్మ సవాల్ విసిరారు.

దిశ, కాకినాడ: వైసీపీ నేతలు ఎవరైనా తనతో చర్చలకు వస్తే జగన్ అక్రమాలు నిరూపించడానికి సిద్ధమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ ఎన్ వర్మ సవాల్ విసిరారు. గడిచిన ఐదేళ్లలోని వైసీపీ పాలనలో అప్పటి సీఎం జగన్ తన నిర్ణయాలతో రూ.10 లక్షల కోట్లు వృధా చేయడమే కాకుండా దానికి సంబంధించి ఏడాదికి వడ్డీలు చెల్లించడం ద్వారా మొత్తం 1.40లక్షల కోట్లను చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ అవగాహన లేని పాలన, నిధులు వృధా పై సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించారన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని వర్మ వివరించారు. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో వర్మ విలేకరులతో సమావేశాన్ని నిర్వహించి సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చెప్పిన విషయాలను వివరించారు.
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. సీఎంగా పని చేసిన వైఎస్ జగన్ ఆర్థిక అక్రమాలు చేసి.. లెక్కలు లేకుండా నిధులు దుర్వినియోగం చేశారన్నారు. దానికి సంబంధించి గత నాలుగు నెలలుగా లెక్కలు వేయడంతో విస్తుబోయిన నిజాలు బయటకు వచ్చాయని తెలిపారు. దీన్ని సీఎం చంద్రబాబు బహిర్గతం చేశారన్నారు. గడిచిన ఎనిమిది నెలల్లో రాష్ట్ర ప్రగతి పథంలో ముందు ఉందని తెలిపారు. జగన్ హయాంలో 1.46లక్షల కోట్లను సంక్షేమ కార్యక్రమాలకు చెల్లించాల్సిన నిధులను ఆపివేశారని అలాగే 19 వేల కోట్ల ధనం వృధాగా ఖర్చు చేశారని తెలిపారు. 8.27లక్షల కోట్లను దోచేయగా ఎస్సీ, ఎస్టీ నిధులను దారి మళ్లించారన్నారు. జగన్ చేసిన అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటడంతో అప్పు తీసుకురాని పరిస్థితితో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారంటూ జగన్ పై వర్మ మండిపడ్డారు.
సంక్షేమ పథకాలు ఏమీ ఆగలేదని అన్ని సకాలంలోనే కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. జగన్ అవినీతి వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోగా పారిశ్రామికవేత్తలు పారిపోయారన్నారు. రాష్ట్రానికి త్వరలోనే ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని తద్వారా మూడు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. మాజీ సీఎం జగన్ 19 వేల కోట్ల ధనం వృధా చేయడం అతని చేతకాని పాలనకు నిదర్శనమన్నారు. వైఎస్ జగన్ చేసిన మోసాన్ని సీఎం చంద్రబాబు నిజాయితీగా ప్రజలకు తెలియజేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వ హామీలైన గ్యాస్ సబ్సిడీ అమలు చేసామని, ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం, డీఎస్సీకి త్వరలోనే రూప కల్పన చేస్తామని వర్మ చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మడికి సన్యాసిరావు, ఏ శివ తదితరులు పాల్గొన్నారు.






