కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో పొంచి ఉన్న వరద ముంపు

by Thanuru Gopichand |

రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుఫాను కారణంగా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి.

కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో పొంచి ఉన్న వరద ముంపు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుఫాను కారణంగా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాలు, కోస్తా జిల్లాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సు తీర ప్రాంతాలవాసులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. కొల్లేరు వరద నీటితో నిండుతుండడంతో ఇటీవలే ముంపునకు గురైన సమీప గ్రామాల ప్రజలు మరోసారి దిక్కుతోచని పరిస్థితికి చేరుతున్నారు. కొల్లేరు సరస్సు పొంగి వరద ప్రవాహం పెరిగితే నీరు లంక గ్రామాలను ముంచడం ఖాయమంటున్నారు. ఇప్పటికే కొల్లేరు సరస్సుకు ఎగువ ప్రాంతలా నుంచి భారీ నీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పెనుమాక లంక నుంచి గ్రామస్తులు పెద్ద ఎడ్ల గాడి వరకు నాటు పడవలపై ప్రయాణిస్తున్నారు. అక్కడకు చేరుకున్న తరువాత సురక్షితంగా ఉండడం కోసం ఏలూరు, కైకలూరు ప్రాంతాలకు తరలిపోతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్ద ఎడ్ల గాడి నుంచి పెనుమాకలంక మీదుగా ఇంగిలిపాకలంక చేరే రహదారి కొల్లేరు వరద నీటితో మునిగింది. దీంతో ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Next Story