- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప్పాడ రోడ్డు మూసేసి.. మత్స్యకారుల నిరసన
by Naga Rani Yarlagadda |
తీరప్రాంతంలో కాలుష్య పరిశ్రమలు తొలగించాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు నిరసన చేపట్టారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తీరప్రాంతంలో కాలుష్య పరిశ్రమలు తొలగించాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు నిరసన చేపట్టారు. ఉప్పాడ రహదారి ఇరువైపులా మూసేసి బైఠాయించారు. రసాయన కాలుష్య వ్యర్ధాల వల్ల మత్స్య సంపద నశిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్య సంపద నశించి జీవనోపాధి కోల్పోతున్నామంటూ మత్స్యకారులు తెలిపారు. రసాయన వ్యర్ధాలు సముద్రంలోకి విడుదల చేయకుండా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని ప్రధానంగా కోరుతున్నారు. ఒక్కో కుటుంబానికి 1. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదంటూ మత్స్యకారులు భీష్మించారు. వారి ఆందోళనతో ఉప్పాడ నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది.
Next Story






