- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పడకేస్తోన్న పారిశుధ్యం..!
by Jakkula.Mamatha |
బోడసకుర్రు గ్రామంలో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం ఆవహిస్తోంది.

X
దిశ, అల్లవరం: బోడసకుర్రు గ్రామంలో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం ఆవహిస్తోంది. పారిశుధ్యం పడకేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామంలోని ప్రధాన రోడ్డు మార్గంలో ఓ శునకం చనిపోయి రెండు రోజులు గడుస్తున్నా ఆ కళేబరం అక్కడే ఉండిపోవడం పై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కళేబరం కుళ్లిన స్థితిలోకి మారడంతో అటువైపుగా రాకపోకలు సాగించేవారు దుర్గంధం తట్టుకోలేక ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మండిపడుతున్నారు. పారిశుధ్య సిబ్బంది కూడా చెత్త చెదారాన్ని తొలగించే విషయంలో నిర్లక్ష్యం వహించి అలానే వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి శునకం మృత కళేబరాన్ని అక్కడి నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






