- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తేజస్విని అభినందించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
by Vemula.Srinu Prasad |
జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జరిగిన రాష్ట్రస్థాయిలో వ్యాసరచన పోటీల్లో బొబ్బిలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని తేజస్విని ద్వితీయ బహుమతి సాధించారు...

X
దిశ.సీతానగరం: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో వ్యాసరచన పోటీ జరిగాయి. ఈ పోటీల్లో సీతానగరం మండలం బొబ్బిలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని సోడా దాసి తేజస్విని ద్వితీయ బహుమతి సాధించారు. దీంతో తేజస్వినిని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం కలెక్టరేట్ ప్రాగణంలో ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఇదే పోటీల్లో జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన తేజస్వికి 5000 రూపాయల నగదు , ప్రశంసాపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రేష్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Next Story






