- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఆలయ కొండ పై దర్శనమిచ్చిన బీర్ సీసాలు.. భక్తులు ఆగ్రహం
అన్నవరం దేవస్థానం కొండపై నిఘా విభాగం నిద్రపోతోంది అనటానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం.

దిశ, అన్నవరం: అన్నవరం దేవస్థానం కొండపై నిఘా విభాగం నిద్రపోతోంది అనటానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. కొండపైన ఈవో కార్యాలయానికి ఎదురుగా కారు పార్కింగ్ వద్ద శుక్రవారం డస్ట్ బిన్ లో ఖాళీ బీరు బాటిళ్లు లభ్యమవటం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇరవై నాలుగు గంటలూ ఆలయ పరిరక్షణ భద్రత పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన భద్రతా విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమో లేక భద్రతా విభాగం సిబ్బంది లోపమో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. కొండ దిగువ నుంచి కొండపైకి వెళ్లే టోల్గేట్ వద్ద భద్రతా విభాగం సిబ్బంది( పోలీసు హోంగార్డు, ప్రైవేట్ సెక్యూరిటీ) తనిఖీలు చేపట్టకపోవడం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం.
దీనికి తోడు కొండపైన మద్యం బాటిళ్లు లభించడం పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఇటీవల కొండపైన వివాహాలు జరుగుతున్న సమయంలో కొండపైకి వెళ్లే ఓ ప్రైవేటు కారులో 10 మద్యం బాటిళ్లు తీసుకెళ్తుండగా తనిఖీలలో బయటపడ్డాయి. ఈ బాటిళ్లను టోల్గేట్ వద్ద ఉన్న భద్రత సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో మద్యం బాటిళ్లను దేవస్థానానికి అప్పగించకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా అక్కడ సిబ్బంది మాయం చేశారనే ఆరోపణలు వినిపించాయి. శుక్రవారం రత్నగిరిపై లభించిన మద్యం బాటిళ్లు అన్నవరంలో కలకలం సృష్టించాయి. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






