కల్తీ పాల ఘటన.. 16కి చేరిన మృతుల సంఖ్య

by Ramesh Naini |

ఏపీలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.

కల్తీ పాల ఘటన.. 16కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో గత నెలలో చోటు చేసుకున్న కల్తీ పాల ఘటనలో శుక్రవారం నాటికి మరో ఇద్దరు మృతి చెందారు. కిమ్స్‌ బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కడలి కృష్ణారావు (75), డెల్టా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెడ్డి అనంతలక్ష్మి (55) పరిస్థితి విషమించి మరణించారు. ఇన్ని రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన ఆ ఇద్దరితో కలిపి మృతుల సంఖ్య 16కి చేరింది. ఇంకా చికిత్స పొందుతున్న వారు మరో ఐదుగురు ఉన్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Next Story