గోదావరి నదిలో దూకి దంపతుల ఆత్మహత్య

by Jakkula.Mamatha |

తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.

గోదావరి నదిలో దూకి దంపతుల ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, కాకినాడ జిల్లా: తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని రాజమండ్రి వద్ద గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాకినాడ నగరం తూరంగి డ్రైవర్స్ కాలనీకి చెందిన భార్యాభర్తలు కాళ్ల వెంకట రమణ, వరలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. రాజమండ్రి స్థానిక మార్కండేయ స్వామి ఆలయం ఘాట్ వద్ద ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను వెలికి తీసి, పోస్టుమార్టం కు తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story