ఆ జిల్లాలో కొబ్బరి సాగుకు అనుకూలం.. కలెక్టర్ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

కొబ్బరి ఉద్యాన తోటల్లో సైతం ఏదో ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటల సాగు చేస్తేనే రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అవుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైతులకు పిలుపునిచ్చారు.

ఆ జిల్లాలో కొబ్బరి సాగుకు అనుకూలం.. కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, అమలాపురం: కొబ్బరి ఉద్యాన తోటల్లో సైతం ఏదో ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటల సాగు చేస్తేనే రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అవుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైతులకు పిలుపునిచ్చారు. గురువారం అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం లో నాగేశ్వరరావుకు చెందిన కొబ్బరి తోటలలో కోకో అరటి అంతర పంటల సాగు కో కో సోలార్ డ్రైయిoగ్ యూనిట్ పరిశ్రమను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి రైతుల ద్వారా ప్రాసెసింగ్ విధివిధానాల గూర్చి ఆరా తీశారు.

ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో కొబ్బరి రైతులకు అంతర పంటల సేద్యం కల్పతరువుగా మారిందన్నారు. కోస్తా జిల్లాల్లో వాతావరణం కొబ్బరి సాగుకు అనుకూలం అన్నారు. అందువల్లనే కొబ్బరి తోటల విస్తీర్ణం కోనసీమ ప్రాంతంలో ఎక్కువగా ఉందన్నారు. కొబ్బరి తోటల్లో ఉండే పాక్షిక నీడ వల్ల చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఈ వాతావరణం కోకో సుగంధ ద్రవ్య పంటలకు ఎంతో అనువైనదన్నారు. ముదురు కొబ్బరి తోటల్లో అనేక సుగంధ ద్రవ్య పంటలను అంతర పంటలుగా సాగు చేస్తూ, నేరుగా మార్కెటింగ్ చేసుకుంటూ లాభాలను ఆర్జించాలన్నారు. కొబ్బరిలో అంతర పంటలు సాగు చేస్తూ.. వీటి ద్వారా ప్రధాన పంటకు తగ్గకుండా అదనపు ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారన్నారు.

అదనపు ఆదాయాన్ని పొందేందుకు అంతర్ పంటల సాగు దోహదపడుతుందన్నారు.ఆ దిశగా రైతాంగం అంతర పంటల సాగుపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ఆదాయాన్ని పొందాలన్నారు. ప్రకృతి సేద్యం తో పాటు శాస్త్రీయ విధానలను ఆధునిక సేద్యం పద్ధతితో పాటు సకాలంలో ఎరువులు నీటి, యజమాన్యం ఆచరించాలన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కొబ్బరి తోటలో కోకో, వక్క, మిరియాలు, పసుపు అల్లం పండిస్తూ సంతృప్తికరమైన ఫలసాయాన్ని ఆర్జించాలన్నారు. కోకో సాగు వలన ఎకరాకు ఎంత ఆదాయం లభిస్తుంది. ఎకరాకు పెట్టుబడి ఖర్చు ఎంత? అన్న వివరాలను రైతులను అడిగి జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. అదేవిధంగా డ్రైయిర్ యూనిట్ స్థాపన కు పెట్టుబడి వ్యయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి బివి రమణ తాసిల్దార్ జి. వెంకటేశ్వరి, ఉద్యాన అధికారి శైలజ రైతులు దొంగ నాగేశ్వర రావు ముత్యాల జమీల్, యు.భాస్కర రావు, గిరిధర్, నిట్టాల సాయిరాం, మట్టపర్తి మీరా సాహెబ్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

Next Story