AP News:‘పేదలకు అండగా కూటమి ప్రభుత్వం’.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

పేదల పాలిట పెన్నిధిగా, నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు

AP News:‘పేదలకు అండగా కూటమి ప్రభుత్వం’.. మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, కె.గంగవరం: పేదల పాలిట పెన్నిధిగా, నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం కె. గంగవరం మండలం కుందూరు గ్రామంలో లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. పేదల అవసరాలు, సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.

పేదల పక్షపాతిగా ప్రభుత్వం పని చేస్తూ అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4 వేలు పింఛను మన రాష్ట్రంలోనే ఇస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం తీవ్ర అనారోగ్యంతో ఉండి, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు పింఛను మంజూరు చేస్తుందన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన అజెండాగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి సుభాష్ పేర్కొన్నారు. మంత్రి సుభాష్ వెంట కూటమి నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story