- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Chandrababu Naidu: దేవరపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు....

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేవరపల్లి మండలం, చిలకావారిపాకలులో జీడిపిక్కల లోడ్‍తో లారీ బోల్తా కొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన అందించాలని అధికారులను ఆదేశించారు.
Next Story






