ప్రభుత్వంపై చింతా అనురాధ ఫైర్.. సంచలన డిమాండ్

by Vemula.Srinu Prasad |

ముఖ్య‌మంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాల‌ని చింతా అనురాధ డిమాండ్ చేశారు...

ప్రభుత్వంపై చింతా అనురాధ ఫైర్.. సంచలన డిమాండ్
X

దిశ‌, అల్లవ‌రం: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కావాలనే తప్పుడు ప్రచారం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కుట్ర ఎట్టకేలకు పూర్తిగా బట్టబయలైందని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ అన్నారు. లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సీబీఐ అందించిన నివేదిక స్పష్టంగా తేల్చిందని, ఇది కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల కుట్రకు చెంపపెట్టు లాంటిదని చింతా అనురాధ మండిపడ్డారు. రాజకీయ లాభం కోసం, అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వంటి అత్యంత పవిత్రమైన అంశాన్ని రాజకీయానికి వాడుకోవడం అత్యంత బాధాకరమని, ఇది భక్తుల విశ్వాసంపై చేసిన ప్రత్యక్ష దాడి అని ఆమె తీవ్రంగా విమర్శించారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Next Story