Disha Effect: అన్నవరం దేవస్థానంలో అర్చకుల అంతర్గత బదిలీలకు బ్రేక్!

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-03 12:03:16  IST  )

అన్నవరం దేవస్థానం ప్రధానాలయంతోపాటు వివిధ ఉపాలయాలలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు, ముఖ్య అర్చకులు ప్రధాన అర్చకులు బదిలీలకు బ్రేక్ పడింది...

Disha Effect: అన్నవరం దేవస్థానంలో అర్చకుల అంతర్గత బదిలీలకు బ్రేక్!
X

దిశ, అన్నవరం: అన్నవరం దేవస్థానం ప్రధానాలయంతోపాటు వివిధ ఉపాలయాలలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు, ముఖ్య అర్చకులు, ప్రధాన అర్చకుల బదిలీలకు బ్రేక్ పడింది. దీర్ఘకాలంగా ఒకే చోట పని చేస్తున్న అర్చకులను అంతర్గత బదిలీలు చేపట్టాలని ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి అన్నవరం దేవస్థానం కార్యాలయానికి ఉత్తర్వులు వెలుపడ్డాయి. దీన్ని అదనుగా తీసుకొని దేవస్థానం ఉన్నతాధికారి ఒకరు అర్చకుల అంతర్గత బదిలీలలో చేతివాటం ప్రదర్శించాలనే ఉద్దేశంతో బదిలీలకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో దిశ పత్రిక ''అర్చకుల అంతర్గత బదిలీల వ్యవహారం"పై కథనాన్ని ప్రచురించింది. దీంతో ప్రస్తుతం బదిలీల వ్యవహారానికి తెరదించారు. వచ్చే స్వామివారి కళ్యాణం అనంతరం బదిలీలు చేపట్టాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

Next Story