కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న పెద్దపులి

by Naga Rani Yarlagadda |

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచారం భయపెడుతోంది. పులిని బంధించేందుకు భౌగోళిక పరిస్థితులు అనుకూలించకపోవడం అటవీశాఖ అధికారులకు సవాలుగా మారింది.

కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న పెద్దపులి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు పెద్దపులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతంలో, అడ్డతీగల మండలం గొట్టువానిపాలెం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏలేశ్వరం మండలం మర్రివీడు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపించడంతో.. అడ్డతీగల, ఏలేశ్వరం, రాజవొమ్మంగి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం పులి ఏలేరు వెనుక జలాలు, కొండలు, అటవీప్రాంతంలో పులి పయనిస్తున్నట్లు రేడియో కాలర్ ద్వారా గుర్తించారు. పులిని బంధించేందుకు ఆ ప్రాంతం భౌగోళికంగా ప్రతికూలంగా ఉండటంతో అటవీ బృందాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. బోనులు సిద్ధం చేసినా పెద్దపులి ఆ దరిదాపుల్లోకి రాకపోవడంతో దాని జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రి సీసీఎఫ్ పర్యవేక్షణలో పులిజాడను గుర్తించేపనిలో పడ్డారు.

Next Story