- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంకా దొరకని పులిజాడ.. భయాందోళనలో గ్రామాల ప్రజలు
కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం.. జిల్లాలోని గ్రామాల ప్రజలకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో సంచరిస్తున్న పులి.. గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పరిమితడక గ్రామంలో పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గతరాత్రి గ్రామంలోని పామాయిల్ తోటలో సంచరించిన పులి.. ఓ గేదెపై దాడి చేసి హతమార్చింది. దీంతో పరిమితడక గ్రామస్తులతో పాటు జెడ్డంగి అన్నవరం గ్రామాల్లోనూ భయాంద్ళనలు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది.. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ప్రజలను అప్రమత్తం చేశారు. వీరభద్రపురం, కొనలోవ, గొండోలు, గవరయ్యపేట, కొట్టంపాలెం గ్రామాల్లో సంచరించిన పులి.. హైవేదాటి అడవిలోకి వెళ్తే.. రాజవొమ్మంగి అటవీప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నార. పులి జాడకోసం పెద్దసంఖ్యలో అటవీ సిబ్బంది గ్రామాలను జల్లెడ పడుతున్నారు.
Next Story






