- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భీమవరంలో దారుణం.. తల్లి, తమ్ముడి హత్య
కన్నతల్లిని.. సొంత తమ్ముడిని ఓ వ్యక్తి హత్య చేసిన దారుణమైన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో (Bhimavaram) జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : కన్నతల్లిని.. సొంత తమ్ముడిని ఓ వ్యక్తి హత్య చేసిన దారుణమైన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో (Bhimavaram) జరిగింది. వివరాల్లోకి వెళ్తే సుంకర పద్దయ్య వీధిలోని మన్నా చర్చ్ (Manna Church) ఎదురుగా ఉన్న ఇంట్లో గునుపూడి శ్రీనివాస్ తన తల్లి, తమ్ముడితో కలిసి నివాసం ఉంటున్నాడు. తెల్లవారుజామున తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజను పదునైన వస్తువుతో దాడి చేసి ప్రాణం తీశాడు. అనంతరం నిందితుడు 112కు కాల్ చేసి పోలీసులకు (Police) సమాచారం ఇచ్చాడు. తానే తల్లి, తమ్ముడిని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు.
ఈ సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. కోవిడ్ సమయంలో శ్రీనివాస్ తండ్రి మరణించాడన్నారు. అప్పటి నుంచి అతనికి మతిస్థిమితం (Mental Condition) లేదని గుర్తించామన్నారు. ఈ క్రమంలోనే అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అంచనా వేస్తున్నామన్నారు. శ్రీనివాస్ సోదరి బెంగళూరు (Bangalore) నుంచి వస్తున్నారన్నారు. సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.






