- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చొల్లంగి అమావాస్య పుణ్య స్నానాల్లో అపశృతి.. ఒకరి మృతి
చొల్లంగి అమావాస్యను పురస్కరించుకుని అల్లవరం మండలం నక్కారామేశ్వరం సముద్ర తీరంలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది.

దిశ,అల్లవరం: చొల్లంగి అమావాస్యను పురస్కరించుకుని అల్లవరం మండలం నక్కారామేశ్వరం సముద్ర తీరంలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సముద్రంలో స్నానం చేస్తూ సముద్ర కెరటాల ఉధృతికి కొట్టుకుపోయాడు. వివరాల్లోకి వెళితే.. అయినవిల్లి మండలం నల్లచెరువు కు చెందిన బొడ్డు వెంకట సుబ్బారావు(47) మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. అయితే కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన వెంకటసుబ్బారావు, అతని సోదరుడు రమేష్‌లు ఇద్దరూ సముద్రంలో స్నానాలు చేసేందుకు దిగారు.
ఈ క్రమంలో సముద్రకెరటాల ఉద్ధృతికి వెంకటసుబ్బారావు, రమేష్‌లు కొట్టుకుపోతుండగా వెంకటసుబ్బారావు గల్లంతయ్యాడు. స్థానికులు రమేష్‌ను కాపాడారు. కాసేపటికే వెంకట సుబ్బారావు మృతదేహం తీరానికి కొట్టుకు వచ్చింది. సముద్రంలో స్నానాలు చేసేవారికి పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ నిర్దేశించిన స్థలాల్లో కాకుండా తీరం వెంబడి స్నానాలు చేస్తుండడం వల్ల ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు చెబుతున్నారు. ఈ సంఘటనా స్థలానికి అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్‌కుమార్ వెళ్లి పరిశీలించారు. అల్లవరం ఎస్సై హరీష్‌కుమార్ కేసు నమెదు చేసినట్లు తెలిపారు.






