Pithapuram : వరదలో పవన్ ఇంటి స్థలం.... చుట్టూ ఏలేరు కాలువ నీళ్లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-09-11 14:53:04  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటి స్థలం వరదలో చిక్కుకుంది..

Pithapuram : వరదలో పవన్ ఇంటి స్థలం.... చుట్టూ ఏలేరు కాలువ నీళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటి స్థలం వరదలో చిక్కుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాకినాడ జిల్లా పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలో ఇల్లు కట్టుకునేందుకు 216 నేషనల్ హైవే పక్కన 3.52 ఎకరాల స్థలాన్ని పవన్ కల్యాణ్ కొనుగోలు చేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షం, వరదలతో ఆయన ఇంటి స్థలం నీట మునిగింది. పక్కనే ఉన్న ఏలేరు కాలువ పొంగడంతో ఆ వరద నీరు పవన్ స్థలంలోకి చేరి చెరువును తలపిస్తోంది. పవన్ స్థలంతో పాటు పరసర పంట పొలాలు నీటిలో ముగిపోయాయి. వరద బాధితులను పరామర్శిస్తున్న పవన్ కల్యాణ్.. ఆయన కూడా బాధితుడిగా మిగిలిపోయారని స్థానికులు అంటున్నారు.

More News : సీఎం రేవంత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ.. సీఎంఆర్ఎఫ్‌కు రూ.కోటి చెక్కు అందజేత

Next Story