లాడ్జిలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా పిఠాపురం పంచ‌వ‌టి లాడ్జిలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు....

లాడ్జిలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురంలో రైల్వేస్టేష‌న్ రోడ్డులో ఉన్న పంచ‌వ‌టి లాడ్జిలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. మృతి చెందిన వ్య‌క్తి వ‌య‌స్సు 30 నుండి 35 సంవ‌త్స‌రాలు ఉంటుంద‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్థారించారు. ఇతడు ఎవ‌ర‌నేది తెలియ‌రాలేదు. శ‌నివారం రూమ్ అద్దెకు తీసుకున్నాడు. ఆదివారం ఉద‌యం ఎంత‌కీ త‌లుపుతీయ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన లాడ్జి సిబ్బంది కిటికీలు తెర‌చి చూసేస‌రికి, ఫ్యాన్‌కి బెడ్‌షీటుతో ఉరివేసుకుని వేలాడుతూ క‌నిపించారు. లాడ్జి సిబ్బంది స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోస్టు మార్టం నిమిత్తం మృత‌దేహాన్ని పిఠాపురం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. 5.3 అడుగుల ఎత్తు ఉన్నాడ‌ని, న‌లుపురంగుపై చొక్కాపై తెలుపు రంగు డిజైన్‌, సిమ్మెంట్ క‌ల‌ర్ ప్యాంటు ధ‌రించిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని పిఠాపురం ప‌ట్ట‌ణ ఎస్సై వి.మ‌ణికుమార్ తెలిపారు.

Next Story