- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా ముమిడివరం నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత తమ్ముడిని అన్న నరికి చంపారు. తాళ్లరేవు మండలం పి.మల్లవరం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం చెలరేగింది. దీంతో తమ్ముడిపై అన్న కక్ష పెంచుకున్నారు. అదును చూసి తమ్ముడిని నరికి చంపారు. అనంతరం పారిపోయారు. విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. వివాదాలు తలెత్తితే తమను సంప్రదించాలని, ఎవరూ కూడా క్షణికావేశానికి పాల్పడవద్దని సూచించారు. కటుంబ సభ్యులను దృష్టి ఉంచుకుని సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. హత్యలు చేసి జైలుకు వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచించారు.
Next Story






