ఆటోలో కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా ఘోరం.. ఇద్దరి పరిస్థితి విషమం

by Vemula.Srinu Prasad |

కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న భక్తుల ఆటోకు రోడ్డు ప్రమాదం జరిగింది..

ఆటోలో కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా ఘోరం.. ఇద్దరి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: శుక్రవారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లాలో నేషనల్ హైవే రక్తసిక్తం అయింది. దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి సీతంపేటకు చెందిన 11 మంది కుటుంబ సభ్యులు.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఆటోలో బయల్దేరారు. కృష్ణంపాలెం వద్ద ఆటోను వెనక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story