- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > తూర్పుగోదావరి > నర్సింగ్ కాలేజీలో దారుణం.. రెండు రోజులుగా విద్యార్థినులకు భోజనం పెట్టని యాజమాన్యం
నర్సింగ్ కాలేజీలో దారుణం.. రెండు రోజులుగా విద్యార్థినులకు భోజనం పెట్టని యాజమాన్యం
by Vemula.Srinu Prasad |
కాకినాడలో ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో దారుణం జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడలో ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో దారుణం జరిగింది. ఫీజులు చెల్లించలేదని విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. రెండు రోజులుగా 40 మంది విద్యార్థినులను కాలేజీలో బంధించారు. కనీసం హాస్టల్‌కు కూడా వెళ్లనివ్వలేదు. కాలేజీలోనే ఉంచి భోజనం, నీళ్లు వంటి సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో విద్యార్థినులు ఆకలితో అల్లడిపోయారు. స్థానిక ఆర్డీవోకు విషయం తెలియడంతో విద్యార్థులకు భోజనం అందించారు. ఫీజు రీఎయింబ్స్‌మెంట్ డబ్బులు వచ్చే వరకూ విద్యార్థినులను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించారు. ఈ ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహ వ్యక్తం చేశారు. నర్సింగ్ కాలేజీ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story






