ప్రజలను అప్రమత్తం చేయండి : డిప్యూటీ సీఎం

by Thanuru Gopichand |

మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

ప్రజలను అప్రమత్తం చేయండి : డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టరుతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం మాట్లాడారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను కాకినాడ తీరాన్నీ తాకే అవకాశం ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వారు సురక్షితంగా ఉండడానికి కావాల్సిన చర్యలను చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, ఔషధాలు వంటివి సమకూర్చి ఉంచాలన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటి పారుదల, పోలీసు, అగ్నిమాపక శాఖలతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఏలేరు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరనున్న నేపథ్యంలో నీటిని వదిలేటప్పుడు పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలను జారీ చేయాలని సూచించారు. పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల రైతులు, ప్రజలకి ముందస్తు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Next Story