చురుగ్గా రహదారి నిర్మాణ పనులు

by Jakkula.Mamatha |

ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలంలో పాటవల రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి.

చురుగ్గా రహదారి నిర్మాణ పనులు
X

దిశ ప్రతినిధి,కోనసీమ: ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలంలో పాటవల రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి. గ్రామంలో చాలా కాలం నుంచి రహదారి గోతులు మయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనులు గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా వదిలేశారు. ప్రజలు ఎంత మొత్తుకున్నా పట్టించు కోలేదు. దీని వల్ల గ్రామంలో నివసించే రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు వ్యాపారులు చాలా అవస్థలు పడేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ దాట్ల సుబ్బరాజు స్పందించారు. ప్రత్యేక నిధులు విడుదల చేయించారు. దీంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో వారంలో రోడ్డు పనులు పూర్తి అవుతుంది అని దాట్ల సుబ్బరాజు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story