- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైలు నుంచి జారిపడ్డ మహిళ.. తీవ్ర గాయాలు
by Jakkula.Mamatha |
రాజమహేంద్రవరం వైపు నుంచి విశాఖపట్నం వైపుగా వెళ్తున్న రైలు నుంచి ఓ మహిళ జారి పడింది

X
దిశ, తుని: రాజమహేంద్రవరం వైపు నుంచి విశాఖపట్నం వైపుగా వెళ్తున్న రైలు నుంచి ఓ మహిళ జారి పడింది. గుల్లిపాడు సమీపంలో రన్నింగ్ ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైల్వే సిబ్బంది హుటాహుటిన ఆ మహిళను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్‌కి తరలించారు. ఆ మహిళ చింతపల్లి ఏజెన్సీ కించంగి గ్రామానికి చెందిన కుమారిగా (45) పోలీసులు గుర్తించారు. కోర్టు వాయిదా నిమిత్తం చిత్తూరు వెళ్లి రైలులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






