- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, పలువురి పరిస్థితి విషమం
ఏపీలో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండల వేట్లపాలెంలో బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ..

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండల వేట్లపాలెంలో బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. సహాయ చర్యలు అందిస్తున్నారు. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో శరీర అవయవాలు చెల్లాచెదురుగా పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో స్థానికులు సైతం సహాయ చర్యలు అందిస్తున్నారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై హోంమంత్రి అనిత వంగలపూడి స్పందించారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు.
పొలాల వెనుక చిన్న కుటీర పరిశ్రమలా బాణా సంచా తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే ఇందుకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. పచ్చని పొలాల్లో ఎలాంటి మందు గుండు సామగ్రి తయారు చేయడం నిషేధం అని చెప్పారు. అనుమతులు లేకుండా బాణా సంచా తయారీ చేస్తున్నారని స్పష్టం చేశారు.






