డివైడర్‌ను ఢీకొట్టి లారీ బోల్తా

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లాలో డివైడర్‌ను ఢీకొట్టి లారీ బోల్తా పడింది.

డివైడర్‌ను ఢీకొట్టి లారీ బోల్తా
X

దిశ, కాకినాడ జిల్లా: సామర్లకోట కాకినాడ కెనాల్ రోడ్డు రైల్వే గూడ్స్ షెడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక ఫ్లై ఓవర్ బ్రిడ్జి‌ డివైడర్‌ను లారీ ఢీకొట్టింది. అనంతరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.

Next Story