- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం, ముగ్గురికి తీవ్ర గాయాలు
by Vemula.Srinu Prasad |
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది..

X
దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. ఈ సమయంలో కారులో ఉన్న నలుగురికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతి చెందిన మహిళను వల్లూరి సత్యనారాయణమ్మగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






