కోడిపందాల బరులపై దాడి.. 119 మంది పందెం రాయుళ్ల అరెస్ట్

by Jakkula.Mamatha |

కాకినాడ జిల్లా, కోరింగ పోలీసు స్టేషన్ పరిధిలో కోడిపందాల శిబిరంపై కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

కోడిపందాల బరులపై దాడి.. 119 మంది పందెం రాయుళ్ల అరెస్ట్
X

దిశ, కాకినాడ: కాకినాడ జిల్లా, కోరింగ పోలీసు స్టేషన్ పరిధిలో కోడిపందాల శిబిరంపై కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 119 మంది కోడి పందెం రాయుళ్ళను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.9.87లక్షల నగదు, 112 పందెపు కోళ్లు, 5 కార్లు, 21 మోటార్ సైకిళ్ళ ను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కోడి పందాలు ఆడుతున్న వారిపై దాడి నిర్వహించారు. కోరింగ పోలీస్ స్టేషన్ పరిధిలో జి వేమవరం లో పెంకె రాంబాబు మామిడి తోటల్లో కోడిపందాలు ఆడుతున్న వారిపై, కోరింగ ఎస్ఐ సత్యనారాయణ, స్టేషన్ సిబ్బంది, కాకినాడ రూరల్ సిబ్బంది,స్పెషల్ పార్టీతో దాడి చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ముద్దాయిలు, కోళ్లు, నగదును ఛార్జి షీట్ తో కోర్టులో ప్రవేశ పెట్టారు.

Next Story