కాకినాడలో తల్లి, కొడుకు మృతి కలకలం.. హత్యా, ఆత్మహత్యా..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-04 09:29:28  IST  )

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తల్లి, కుమారుడి మృతి కలకలం రేగింది...

కాకినాడలో తల్లి, కొడుకు మృతి కలకలం.. హత్యా, ఆత్మహత్యా..?
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) కాకినాడ(Kakinada)లో ఈ రోజు ఉదయం తల్లి, కుమారుడి మృతి కలకలం రేగింది. రెండు నెలల క్రితం అబుదాబి(Abudabi) నుంచి వచ్చిన రమ్యదీప్తి తన కుమారుడు ప్రశాంత్‌తో కలిసి రేచర్లపేటలో నివాసముంటున్నారు. తన భర్త శరత్ బాబు ప్రస్తుతం గల్ఫ్‌లోనే ఉన్నారు. ఏమైందో ఏమోగాని ఈ రోజు ఉదయం వాళ్లు ఉంటున్న ఇంట్లో మృతి చెందారు. రమ్య దీప్తి డెడ్ బాడీ ఇంట్లోని ఫ్యాన్‌కు వేలాడుతోంది. ప్రశాంత్ కాళ్లు, చేతులు, నోరు, ముక్కుకు పాస్టర్ వేసి ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దీప్తి ఫోన్ కాల్ డేటా కోసం ప్రయత్నం చేస్తున్నారు. కేసును త్వరగా చేధిస్తామని పోలీసులు తెలిపారు.

Next Story