- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో భూ ప్రకంపనలు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు
విశాఖలో ఇవాళ స్వల్ప భూకంపం సంభవించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో ఇవాళ స్వల్ప భూకంపం సంభవించింది. అయితే, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4:30 మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే, భూ ప్రకంపనల వేళ కొన్ని చోట్ల శబ్దాలు కూడా వచ్చినట్లుగా స్థానికులు వెల్లడించారు. ఈ హఠాత్పరిణామంతో విశాఖ ప్రజలు కలవరపాటుకు గురయ్యారు. తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లోని వారు ముందు జాగ్రత్తగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






