అర్ధరాత్రి ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు

by Malleboina Mahesh |

ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి సంబవించిన భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి.

అర్ధరాత్రి ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా (Prakasam District)లో అర్ధరాత్రి సంబవించిన భూ ప్రకంపనలు (Earthquake tremors) ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. కాగా ఇటీవల కాలంలో గుండ్లకమ్మ నది పరిసరాల్లో తరచుగా భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజా ప్రకంపణలపై అధికారులు స్పందిస్తూ.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కాగా మే 6న ప్రకాశం జిల్లాలోని పొదిలి, కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో స్వల్ప భూ ప్రకంపనలు (Minor earthquakes) సంభవించాయి.

ఇవి ఐదు సెకన్ల పాటు కొనసాగాయి, పెద్ద ఎత్తున శబ్దాలతో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తూర్పు కంభంపాడు గ్రామాల్లో గతంలో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ సంఘటనల సమయంలో విద్యార్థులు, ఉద్యోగులు భయంతో బయటకు పరుగెత్తారు. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం గ్రామాల్లో కూడా రెండు సెకన్ల పాటు భూమి కంపించిన సందర్భాలు ఉన్నాయి.

Next Story